సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం బోరంచ గ్రామ శివారులో నారాయణ అనే వ్యక్తి పత్తి చేనులో 155 గంజాయి మొక్కలు అక్రమంగా సాగు చేస్తున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ దుబ్బాక శంకర్ , ఎస్ఐ హనుమంతు , సిబ్బంది పాల్గొన్నారు.