దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో మహిళలకు 50 శాతం సబ్సిడీతో 70 కుట్టుమిషన్లు అక్షిత స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు అందజేయడం జరిగిందని ఆదివారం రాష్ట్ర వాల్మీకి చైర్మన్ బొజ్జమ్మ తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధికి చెందగలరని, కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన అక్షితఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఉచిరప్ప,మహేష్, స్వామి,రంగడు, ఉమేష్, వీరయ్య, దొరస్వామి వివిధ గ్రామాల ప్రజలు GS పాల్గొన్నారు.