గుత్తి పట్టణంలోని గుంతకల్లు రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది. ఈ క్రమంలో శుక్రవారం రోడ్డుపై ఉన్న గుంతలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తిరుపాల్, సుశీలమ్మ దంపతులకు గాయాలయ్యాయి. గాంధీ సర్కిల్ వద్ద నుంచి గుంతకల్లు రోడ్డు లోని రైల్వే బ్రిడ్జి వరకు రోడ్డు దారుణంగా తయారయింది. ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డుకు కనీసం మరమ్మతులైనా చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.