తంటికొండ దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసి నియోజకవర్గ ప్రజలకు కానుకగా ఇస్తానని జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తంటికొండ కొండపై వేంచేసియున్న స్వయంభు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ అధికారులతో కలిసి ఆయన దర్శించుకోవడం జరిగింది.