రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా సమీపంలో ఒక వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడం జరిగింది. అతనికి గుర్తు తెలియని వాహనం ఢీకొనడం జరిగిందా లేదా అతడే డివైడెడ్ ఢీకొన్న అనే విషయం తెలియవలసి ఉంది. స్థానికుల సమాచారంతో గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.