సదాశివపేట పట్టణంలోని పిట్టలకేరి కాలనీలో రాత్రి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును చోరీ చేశారు. ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి ఆమెతో మాట్లాడి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.