జీవో నెంబర్ 49 ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. అటవీ శాఖ అధికారులు సిర్పూర్ నియోజకవర్గంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు హక్కులను సాధించుకునేందుకు సిర్పూర్ నియోజకవర్గం లోని రైతులందరితో ఆగస్టు 18 వ తేదీ సోమవారం రోజున కాగజ్నగర్ అటవీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.