నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఇంట్లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని సాదత్ స్ట్రీట్ కు చెందిన మహమ్మద్ బురాన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.