కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఊరూవాడా వరలక్ష్మీదేవి వ్రతం ను అన్ని దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.చివరి శ్రావణమాస శుక్రవారం సందర్భంగా భక్తులు తమ శక్తిమేరకు లక్ష్మీదేవిని పూజించారు. ఇందులో భాగంగా శ్రీ విజయ విజ్ఞేశ్వర స్వామి వారి దేవస్థానం కొత్తగూడెంలో స్వర్ణ దుర్గ అమ్మవారికి చెరకుగడలు, బెల్లం దిమ్మలతో అలంకరణ చేశారు. అనంతరం కుంకుమ పూజలు చేశారు. శుక్రవారం సాయంత్రం సైతం విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి అమ్మవారిని 108 చీరెలతో అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. పరసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.