కోనసీమ కాపు ఉద్యోగ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. కాపు ఉద్యోగ సేవ సమితి ఆధ్వర్యంలో అమలాపురం లో జరిగిన సమావేశంలో ఆర్థికంగా వెనుకబడిన 75 మంది కాపు విద్యార్థులకు రూ.3.75 లక్షల ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు