ఉద్దాన మంచినీటి సరఫరా ప్రాజెక్ట్ నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణ లో గాంధీ విగ్రహం వద్ద కార్మికులు చేస్తున్న నిరసన నేటికి 10వ రోజుకి చేరుకుంది. సోమవారం కార్మికులకు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పలువు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి కానీ, 25 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న వారిని తొలగించడం అన్యాయమని అన్నారు. మెగా కంపెనీ తక్షణమే తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.