రాయదుర్గం పట్టణంలోని వందపడకల ఏరియా ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని, అర్థాంతరంగా ఆగిన ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం వైద్య రంగంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాయదుర్గం ఆసుపత్రిలో 25 మంది వైద్యులకు గానూ 6 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల రోగులకు వైద్య సేవలు అందడం లేదన్నారు.