మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల పరిధి లో ఉత్తులూరు గ్రామంలో సాయిలు అనే వ్యక్తికి చెందిన బైక్ గత నెల దొంగలించబడింది. ఈ క్రమంలో ఆ బైకును విక్రయించేందుకు హైదరాబాద్ వెళుతుండగా పెద్ద శంకరంపేట కు చెందిన శివశంకర్ ను పోలీసులు వాహనాల తనిఖీల్లో పట్టుకున్నారు. ఇది మనకి అలవాటు పడిన శివశంకర్ బైకులు దొంగతనాలకు పాల్పడుతూ హైదరాబాదులో విక్రయిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.