ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కర్నూల్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాషా డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూల్ మార్కెట్ యార్డును సందర్శించి ఉల్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిలాని భాష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుందని రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధర కల్పించకపోవడం దురదృష్టకరమని పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని ఉల్లి రైతులకు క్వింటాలుకు 400 రూపాయలు అంటున్నారని, కనీసం రెండు వేల రూపాయలు మద్దతు ధర కల్పించాలనిడిమాండ్ చేశారు.