అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ చిన్న కోనలలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి విద్యుత్తు సరఫరా లేక 63 రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోయారు. చిన్నకోనెలలో సుమారు 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి 63 రోజులవుతుందని, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. దశాబ్దాలుగా కరెంటు సౌకర్యం కల్పించాలని దిమిటి వెలుగుతో తో పోరాటం చేస్తే ఎనిమిది నెలలు క్రితం విద్యుత్తు సరఫరా వచ్చిందని ఈలోగా ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో చీకట్లో మగ్గుతున్నామని గిరిజనులు వాపోయారు.