Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: రైల్వే డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఆధ్వర్యంలో 'సండేస్ ఆన్ సైకిల్'

India | Sep 7, 2025
విశాఖ వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఆధ్వర్యంలో ఆదివారం 'సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమం నిర్వహించారు. 'ఫిట్‌నెస్ కి డోస్, ఆధా ఘంటా రోజ్' (ఆరోగ్యానికి ప్రతిరోజూ అరగంట కేటాయించండి) అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీలో రైల్వే అధికారులు, ఉద్యోగులు, వారి పిల్లలు, స్థానిక క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఆర్‌ఎం నివాసం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ డీఆర్‌ఎం కార్యాలయం, వైర్‌లెస్ కాలనీల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఈసీవోఆర్ మహిళా సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో యోగా సెషన్‌ను కూడా నిర్వహించారు. ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us