ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం నందు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణారావు మాట్లాడుతూ డివిజన్లో ఉన్న రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేదని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. యూరియా ఎటువంటి కొరత లేదని ఆధారాలతో సహా అధికారులు వివరించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం గా వైసీపీ నాయకులు లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎరువుల విషయంలో రైతులు మాత్రం ఎలాంటి ఆందోళన చేయడం లేదన్నారు. వైసిపి నాయకులు మాత్రమే ఆందోళన చెందుతూ నిరసన తెలుపుతున్నారు అని తెలిపారు.