జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడానికి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సింగల్ డెస్క్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వివిధ శాఖలకు తిరగకుండా సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలు ఏర్పాటుకు 20 ఒక్క రోజుల్లో అవసరమైన అన్ని అనుమతులు ఆన్లైన్లో పొందే విధంగా చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు.