48వ వార్డు అధ్యక్షులు పెంచలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వెంకయ్య స్వామి ఆరాధన కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ప్రతీ సంవత్సరం భక్తి పూర్వకంగా జరుపుకుంటూ వస్తున్న ఈ ఆరాధనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు హాజరై, వెంకయ్య స్వామి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ముగిసింది