కాగజ్ నగర్ పట్టణంలోని ఓ బంగారు దుకాణంలో వెండి పట్టీల దొంగతనం జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు కేసును చేదించారు. పట్టణంలో దొంగతనం చేసి ట్రైన్ లో పారిపోతుండగా నలుగురు మహిళలను కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగజ్నగర్ డి.ఎస్.పి రామంజెం ఆదేశాల మేరకు టౌన్ సిఐ ప్రేమ్ కుమార్ సి సి ఫుటేజీ ఆధారంగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులను తిరిగి కాగజ్నగర్ పట్టణానికి తీసుకు వస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు,