మదనపల్లె బఫర్ జోన్ పరిధిలో భూ ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై చర్యలు చేపట్టాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. గురువారం పుణీత్ మాట్లాడుతూ.. మున్సిపల్ యాక్ట్, టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కమిషనర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.