నిత్య అధ్యాయన శీలుడు, మార్కిస్ట్ ఉపాధ్యాయులు, ప్రజా పోరాట యోధ సిపిఐ జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అని పలువురు వ్యక్తలు కొనియాడారు. సుధాకర్‌రెడ్డి మరణం భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమానికే తీరనిలోటని దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలని కొరుకుంటున్న తరుణంలో దానిని ముందుండి నావికుడై నడిపించాల్సిన కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికంగా దూరం కావడం బాధాకరమని వారు పేర్కొన్నారు. భారత కమ్యునిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరంలో డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో కమ్యూనిస్టు దిగ్గజం, సిపిఐ జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి, పూర్వ ఎంపీ