Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 30, 2025
సీతారామపురం మండలం బెస్త కాలనీ అంకాలమ్మ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వరోజు అమ్మవారు మహా దుర్గ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహాదుర్గ దేవి అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు చేశారు. తోట వీధి వాస్తవ్యులు అన్నదాన కార్యక్రమం చేశారు. భక్తులకు, పండితులు అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.