పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులకు శక్తి టీం సభ్యులు శుక్రవారం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు శ్రీనివాసరావు, నిర్మల తదితరులు విద్యార్థులకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్, ఈవిటేజింగ్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. అవసరమైన సమయాల్లో శక్తి యాప్ ను వినియోగించాలని కోరారు.