ఆదిలాబాద్ జిల్లా లోని పలు బెల్టు షాపుపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. గురువారం ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు వివిధ బెల్టు షాపుల్లో 92 మద్యం బాటిల్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని దస్నాపూర్ లో ఠాకూర్ కార్తీక్ సింగ్ వద్ద 35 బాటిల్లు, బాలాజీ నగర్ లో సాయికుమార్ వద్ద 14 బాటిళ్లు, కే.ఆర్.కే కాలనీలో లక్ష్మీ వద్ద 6 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు మావల పోలీసులు తెలిపారు