కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బంకపాలెంలో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆ గ్రామాన్ని సందర్శించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ వార్డుల్లోని సమస్యలు, మౌలిక సదుపాయాల కోసం అన్నీ సచివాలయాలలో కంప్లైంట్ రిజిస్టర్ ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి సమస్యలున్నా సచివాలయాల్లో సంప్రదించాలని తెలిపారు. బంకపాలెం వెళ్లే రోడ్డులో కంపచెట్లు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాటిని తక్షణం తొలగించామని తెలియజేశారు.