బ్రిడ్జిని బాగు చేయించండి సారూ... చిన్న పూల్ బ్రిడ్జిని బాగు చేయించండి సారూ అంటూ నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ ఆదర్శ పాఠశాల విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ధ్వంసమైన బ్రిడ్జి మీదుగా కిలో మీటర్ దూరం నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లారు. బ్రిడ్జిపై అడ్డంగా రేలింగ్ రాడ్ లు పడి ఉన్నాయని అవి దాటుకుంటూ వెళ్లాలంటే కష్టంగా ఉందని అంటున్నారు. బరువైన బ్యాగులతో రోజూ కిలో మీటర్ దూరం నడవాల్సిన పరిస్థితి ఉందని త్వరగా చిన్న పూల్ బ్రిడ్జిని మరమ్మత్తు చేయించాలని విద్యార్దులు కోరుతున్నారు.