పెడనలో వ్యవసాయ, రెవిన్యూ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పెడన పట్టణంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సూర్యశ్రీ ఎంటర్ప్రైసెస్, శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైసెస్ ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, యూరియా అమ్మిన రసీదులను పరిశీలించారు. ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.