బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, దుర్గగుడి ఈవో సినా నాయక్ అధికారులతో కలిసి పరిశీలించారు. గురువారం ఉదయం సమయంలో పుష్కర ఘాటు, స్థానాల ఘాటు, క్యూ లైన్లు భక్తులు విశ్రాంతి తీసుకునే ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులు పాల్గొన్నారు