పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ కాలనీ వద్ద ఓ కారు షెడ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల షెడ్డు పూర్తిగా పొగతో నిండిపోయింది ఒక్కసారిగా కార్మికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి భారీ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.