తన పరువుకు భంగం కలిగించారంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకానిపై పరువు నష్టం దావా వేశారు. విజయవాడ ప్రజా ప్రతినిధుల న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ వేయడంతో ఈ కేసును సెప్టెంబర్ మూడు కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.