చిత్తూరు జిల్లా, కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మహానంది శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున సాంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహానంది దేవస్థానం ఈ.వో N. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఆయన దేవస్థానం అతిథిగృహం నుండి మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు మహానంది దేవస్థానం ప్రతినిధులకు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అం