అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది. హెచ్ఎండిఏ కార్యాలయాన్ని RRR భూ బాధితులు ముట్టడించారు. అలైన్మెంట్ మార్చడంతో తమ భూములు కోల్పోతున్నామని తక్కువ నష్టపరిహారం ఇస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి తరలించారు. దీంతో పోలీసులకు భూబాధితులకు మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.