వినాయక చతుర్థి పురస్కరించుకొని పుట్టపర్తిలో జర్నలిస్టులు ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ తన ఇంటి వద్ద జర్నలిస్టులకు వినాయక విగ్రహం, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. రత్నాకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించి భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని సూచించారు.