ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో సెప్టెంబర్ 30 తేదీ వరకు 30 యాక్ట్ అమలులో ఉందని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు మీడియాకు గురువారం ఉదయం 11 గంటలకు తెలిపారు. 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఊరేగింపులు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదని తెలిపారు. అలా ఎవరైనా కార్యక్రమాలు చేయదల్చుకుంటే పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలా కాదని నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కోటేశ్వరరావు ప్రజలను హెచ్చరించారు.