తిరుపతి జిల్లా నాయుడుపేట విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ సూపర్నెంట్ ఇంజనీర్ సురేంద్ర నాయుడు మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సమస్యల కోసం 1912, 1800 425 155 333 టోల్ ఫ్రీ నెంబర్లకు ఏ సమయంలోనైనా ఫోన్ కాల్ చేయవచ్చని తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది కృషి చేస్తున్నారని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో విద్యుత్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.