కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బద్వేలు నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా టీవీ చానళ్లు,పత్రికల్లో ప్రచురితమైన భూ ఆక్రమణల వార్తలను ఆయన ఖండించారు.తాను ఎక్కడా భూములను ఆక్రమించలేదని, వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.కొంతమంది వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.