విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టెక్కలిలో పలు ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. స్థానిక వంశధార కాలనీ సమీపంలో ఉన్న విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయ ఆవరణలో నిరసన చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతుందని ఆరోపిస్తూ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు షణ్ముఖరావు, వాసుదేవరావు తదితరులున్నారు.