నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎంపీలు స్టీల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన నూతన వైద్య పరికరాలు ఫర్నిచర్ వాటర్ ప్లాంట్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు రఘురామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.