ప్రకాశం బ్యారేజ్ నుంచి సోమవారం మూడు లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద వరద తాకిడి కనిపిస్తోంది. వరద పెరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.