ఎర్రవల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాల యందు వినాయక చవితిని పురస్కరించుకొని విద్యార్థులు వినూత్న రీతిలో వినాయకుని ఆకారాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు వినాయకుడి ఆకారంలో కూర్చుని ప్రదర్శించడంతో ప్రజలను ఆకర్షించారు. కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు.