యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో భారీ వర్షాలు ఇల్లు నీట మునిగిన పరిస్థితిని గురువారం రాత్రి ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఆలేరు పట్టణంలోని రంగ నాయకుల ఆలయం బ్రహ్మం వారి ఆలయం 11 12 వ వార్డుల సమీపంలో ఉన్న బైరాం కుంట తెగిపోవడంతో ఇల్లు నీట మునిగాయి .ప్రజల పరిస్థితులను తెలుసుకొని అధికారులకు అప్రమత్తం కావాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో ఫోన్లో మాట్లాడి రెండు మూడు రోజుల పాటు అవసరమైన ఆహార పదార్థాలను అందించాలని తెలిపారు.