అమీర్పేటలో కొత్తగా ప్రారంభమైన మినిస్టర్స్ వైట్ వస్త్ర ఉత్పత్తి షోరూంను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వస్త్ర రంగంలో పోటీ పెరుగుతున్న తరుణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తే ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మినిస్టర్స్ వైట్ వస్త్ర ఉత్పత్తి ఉదారులు నాణ్యతతో కూడిన క్వాలిటీ వస్త్రాలను అందిస్తున్నారని ప్రజలందరూ కూడా ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.