మెగా డీఎస్సీ-2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం నన్నూరు వద్ద శ్రీనివాస బీఎడ్, రాఘవేంద్ర బీఎడ్ కాలేజీలో మెగా డీఎస్సీ 2025 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం 2600 మంది అభ్యర్థుల కోసం 54 బృందాలు సిద్ధమయ్యాయని డీఈవో తెలిపారు.