రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ని పరిరక్షించి తీరుతామని అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో మంగళవారం మాజీ ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంగయ్య పాదయాత్రను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. రంగయ్య చేస్తున్నది రాజకీయ యాత్ర కాదని ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కొరకు అన్నారు. పాదయాత్ర అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.