ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా బదిలీపై వచ్చిన పి రాజాబాబు శనివారం వేదమంత్రోచనాలు నడుమ హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దల ప్రార్థనల సమక్షంలో పదవి బాధ్యతలను స్వీకరించారు అనంతరం ఆయన మొదటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకు సమస్యల పరిష్కారంలో 24/7 అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు రాజకీయ నాయకుల సమన్వయంతో జిల్లా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పరిష్కారం లేని సమస్య ఉండదని జిల్లా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని తెలిపారు జిల్లాకి ప్రధాన వనరు అయిన వెలుగొండ ప్రాజెక్టు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు