MRP ధరలకే యూరియా అమ్మాలి : AO MRP ధరలకే రైతులకు యూరియా అమ్మాలని విజిలెన్స్ ఏఓ ఎన్.రామాంజనేయ రెడ్డి సూచించారు. శనివారం సాయంకాలం పిచ్చాటూరు, నాగలాపురంలోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ ఎస్ఐ వెంకటరమణతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రత్యేకంగా ఎరువుల కొరతపై దృష్టి సారించారు. విజిలెన్స్ అధికారులు గోడౌన్లో స్టాక్తో పాటు అమ్మకాలను పరిశీలించారు.