దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో రూ. 35 లక్షలతో ఎస్సీ కాలనీలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజ్ ల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో కురుమ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తక్కల రమణ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, సత్యం చంద్రకాంత్, వీరేష్, మండల అధ్యక్షులు నర్సారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.