విద్యుత్ ఘతకానికి మహిళా మృతి చెందిన సంఘటన ఆదివారం 9 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది యాదమరి ఈశ్వర్ కథనం మేరకు మండలంలోని దలవాయిపల్లి పంచాయతీ నూరే నగర్ గ్రామానికి చెందిన అరిఫ్ఫా (40) నీటి మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ ఘాతకానికి గురై సుహ కోల్పోవడంతో హుటా హుటిన కుటుంబ సభ్యులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్ఐ ఈశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.