కొత్తవలస పట్టణంలోని కుమ్మరి వీధిలో నివాసం ఉంటున్న మహిళపై 2023లో దాడికి పాల్పడి బంగారు వస్తువులు చోరిచేసిన ఎల్ కోట మండలం జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మడబత్తుల కృష్ణకు విజయనగరం ఐదవ ఏడీజే జడ్జి ఎన్ పద్మావతి జీవిత ఖైదు ₹1000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించాలని సోమవారం సాయంత్రం విజయనగరంలో జిల్లా ఎస్ పి వకుల్ జిందాల్ తెలియజేశారు. నిందితుడికి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టిన ఏపీపి, పోలీస్ అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అభినందించారు.